Bonthu Rammohan is Hyderabad's new mayor - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Thursday, February 11, 2016

Bonthu Rammohan is Hyderabad's new mayor

Bonthu Rammohan

Hyderabad's new mayor civil authority

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై కూర్చుంటున్న ప్రధమ పౌరుడు బొంతు రామ్మోహన్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనను మేయర్ గా ఎంపిక చేయడంతో ఎవరీయన... ఏంటి ఈయన సంగతులు అనే ఉత్సుకత కలిగింది. ఆయన గురించి క్లుప్త సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన బొంతు రామ్మోహన్ పైన ఉద్యమ కాలంలో ఆయనపై 142 కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు సుమారు ( four ) 4 నెలల పాటు చర్లపల్లి జైలులో కాలం గడపాల్సి వచ్చింది.

విశేషమేమిటంటే... ఆయన ఏ జైలులో ఉన్నారో అదే ప్రాంతం అంటే చర్లపల్లి నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. నిజానికి ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సుకత లేదు. ఐతే చివరి నిమిషంలో పార్టీ ఆయనను పోటీ చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేటర్ గా బరిలోకి దిగారు.

విజయం సాధించడమే కాకుండా ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ పీఠంపైన మేయర్ గా కూర్చున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బీ పూర్తి చేసిన బొంతు అదే యూనివర్సటీలో తన పీహెచ్డీని కూడా సమర్పించారు. గ్రేటర్ మేయర్ పదవిని చేపట్టబోతున్న ఈయన ఉన్నత విద్యను అభ్యసించి ఉండటం, యువకుడై ఉండటంతో నగరాభివృద్ధికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad