మరో 3నెలలకుపైగా వివాహాది శుభకార్యాలకి సరైన ముహూర్తాలు లేవు.
ఈనెల అనగా జూన్ 17నుంచి జులై 16వరకు (అధికమాసం కారణంగా దీన్నే శూన్యమాసం అంటారు) అధికాషాఢం. ఈనెలలో చేసే కార్యక్రమాలు లెక్కలోకిరావు అందుకని విడిచిపెడతారు.
వచ్చేనెల అనగా జూలై17నుంచి ఆగస్ట్14వరకు నిజాషాఢం (ఈనెలలోకూడా అధిక ఆషాఢం వంటిదే) ఇక మూఢాలు( పుణ్యకార్యాలకి అనుకూలించాల్సిన గురు,శుక్ర గ్రహాలు అనుకూలించనికాలం) విశేషించి ఈసారి రెండుమౌఢ్యాలు దగ్గరగా వచ్చాయి.
9 ఆగస్ట్ నుండి 20 ఆగస్ట్ వరకు శుక్రమౌఢ్యమి, 9 ఆగస్ట్ నుండి 09 సెప్టెంబర్ వరకు గురుమౌఢ్యమి - వెరసి సెప్టెంబర్ 09 వరకు ముహూర్తాలు లేవు.ఆగస్ట్‌లో వచ్చే శ్రావణంలోకూడా ఉహూర్తాలులేవు. ఇక భాద్రపదం నడుస్తూంటుంది.
భాద్రపదంలో వినాయక చవితి మినహా వివాహాది శుభకార్యాలకి 13నుంచి వివాహాలు ,గృహప్రవేశాలకి ముహూర్తాలు ప్రారంభమౌతాయి. ఆ లోపు సాధరణ పనులకి అనగా నామకరణం, సామాన్య వ్యాపార వ్యవహారాదులు, సామాన్య ప్రయాణాలు, రిజిష్ట్రేషన్‌లు, ఆపరేషన్‌లు, ముఖ్యమైన సమావేశాలకోసం వినియోగించుకోవాలి.

No comments:
Post a Comment