Beware Girls: Don't wear skin-tight jeans, it may cause paralysis - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Tuesday, June 23, 2015

Beware Girls: Don't wear skin-tight jeans, it may cause paralysis


జీన్స్ ఫ్యాంట్ మీద ఉన్న మోజుతో ఒక మహిళ నానా తంటాలు పడింది. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంది. కుటుంబ సభ్యులు సరైన సమయంలో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు చికిత్స అందించారు.

నాలుగు రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో కేట్ మిడ్డిల్టన్ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమె రెండు రోజుల క్రితం టైట్ జీన్స్ ఫ్యాంట్ (స్కిన్నీ జీన్స్) వేసుకుంది.

తరువాత ఇంటి పనిలో కుటుంబ సభ్యులకు సహాయం చేస్తున్నది. సుమారు నాలుగు గంటల పాటు పని చేసిన తరువాత ఆమె కాళ్లు చచ్చు పడిపోయాయి. నడవడం కష్టం అయ్యింది. ఒక్క సారిగా ఇంటిలో కుప్పకూలిపోయింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించారు. కేట్ వేసుకున్న జీన్స్ ఫ్యాంట్ ను కత్తిరించి చికిత్స అందించారు. టైట్ జీన్స్ ఫ్యాంట్ వేసుకుని తిరగడం వలన రక్తం తొడలకు, కాళ్లకు సరఫరా కాలేదని వైద్యులు చెప్పారు.

కాళ్లలోని నరాలకు రక్తం సరఫరా కాకపోవడం వలన కండరాలు పట్టి వేశాయని వైద్యులు అన్నారు. నాలుగు గంటల పాటు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడంతో ఆమె పూర్తిగా నీరసించి పోయింది. పూర్తిగా కొలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు కేట్ కు సూచించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad