flipkart cheating: by customer Facebook post sparks outrage on Internet - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Sunday, June 7, 2015

flipkart cheating: by customer Facebook post sparks outrage on Internet


ఈ మధ్య కాలం లో ఎటువంటి చిన్న వస్తువు కొనాలన్నా కూడా ఆన్లైన్ లోనే బుకింగ్ చేస్తున్నారు. అయితే దీన్నే అదునుగా చేసుకొని కొన్ని రిటైలింగ్ వెబ్ సైట్ లు ప్రజలను మోసం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. భారతదేశ అతిపెద్ద రిటైలింగ్ సంస్ద ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారులను మోసం చేస్తూ అడ్డంగా దొరికి పోయింది. 

కోల్ కత కు చెందిన మణి శంకర్ సేన్ అనే వినియోగదారుడు ఫ్లిప్ కార్ట్ లో చెప్పులు కొనదలిచాడు. రూ.799 ఉన్న చెప్పులు 50 శాతం డిస్కౌంట్ తో రూ.399 కే అందిస్తున్నామని ఫ్లిప్ కార్ట్ తన వెబ్ సైట్ లో తెలపడం తో అతను వాటిని ఆర్డర్ చేయబోయాడు. అయితే ఆర్డర్ చేసే సమయంలో వాటిని నిశితంగా చూడగా వాటిపై నిజమైన ధరే రూ.399 గా ఉంది. ఈ ప్రైస్ ట్యాగ్ ఉన్న సదరు చెప్పుల చిత్రాన్ని ఫ్లిప్ కార్ట్ కు పంపించడమే కాకుండా ఇటువంటి తప్పుడు పనులు చేయడం వలన వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోడమే కాకుండా, అమ్మకాలను కూడా కోల్పోతారని అతను సూచించారు. 

దీన్ని గుర్తించిన ఫ్లిప్ కార్ట్ తమ తప్పును సరిదిద్దుకుంటామని తెలిపింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ చేసిన మోసానికి వినియోగదారులనుంచి పెద్ద ఎత్తున నిరసన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad