ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అమెరికా వైద్యులు పూర్తి పుర్రె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఈ శస్త్ర చికిత్స దాదాపు 15 గంటల పాటు జరిగినట్లు హౌస్టన్ మెథడిస్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
జేమ్స్ బోయ్‌సన్(55) అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడికి క్యాన్సర్ కారణంగా పుర్రె పై భాగం(మాడ)కు గాయం కావడంతో పుర్రె మార్పిడి అనివార్యమైంది. దీంతో అతనికి ఈ పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చేసినట్లు టెక్సాస్‌లోని మెథడిస్ట్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
చనిపోయిన ఓ వ్యక్తి కపాలాన్ని దానమిచ్చేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో ఈ శస్త్రచికిత్సకు మార్గం సుగమమైందని చెప్పారు.
అతనికి పుర్రె మార్పిడితో పాటు క్రానియోఫేషియల్ కణజాలం మార్పిడి, మూత్ర పిండం, క్లోమం మార్పిడి కూడా చేశారు. దాదాపు ఈ శస్త్ర చికిత్సలు అన్నింటికి 24 గంటల సమయం పట్టిందని వైద్యులు చెప్పారు.

No comments:
Post a Comment