చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్సీ, వైయస్సార్ కాంగ్రెస్ నేత రెహమాన్‌కు రంగారెడ్డి జిల్లా ఐదో అదనపు న్యాయస్థానం శిక్ష విధించింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.44 లక్షలభారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మంగళవారం తీర్పు ఇచ్చారు. 2009లో శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తి రెహమాన్‌పై ఫిర్యాదు చేశారు
చికిత్స పొందుతూ మహిళా ఖైదీ మృతి:
గుండె నొప్పితో ఓ మహిళ ఖైదీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. చంచల్‌గూడ మహిళ జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన వడ్డెర రేణుక(39) ఓ హత్య కేసులో నిందితురాలు.
ఆమెను పోలీసులు గత డిసెంబర్‌లో చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆమె రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. మంగళవారం ఉదయం రేణుకకు అకస్మాత్తుగా గుండె నొప్పి రాగా, జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉస్మానియా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. మృతురాలి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సిఐ కెపివి రాజు తెలిపారు.

No comments:
Post a Comment