Former Lok Sabha Speaker Somnath Chatterjee Dies Aged 89 - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Monday, August 13, 2018

Former Lok Sabha Speaker Somnath Chatterjee Dies Aged 89



లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ చట్టర్జీ ఇవాళ(సోమవారం,ఆగస్టు-13) తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. సోమ్‌నాథ్‌ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆదివారం(ఆగస్టు-12) గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో స్కూలు విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

సోమ్‌నాథ్‌ ఛటర్జీ 2004 నుంచి 2009 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 10 సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన సోమ్‌నాథ్‌ 1968లో సీపీఎంలోచేరారు.  తర్వాత పరిణామాల్లో ఆయనను పార్టీనుంచి బహిష్కరించడంతో ఇండిపెండెంట్‌గా కొనసాగారు.




No comments:

Post a Comment

Post Bottom Ad