A man hanged because of He did not have a chicken curry funny news - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Sunday, August 12, 2018

A man hanged because of He did not have a chicken curry funny news

ఇంట్లో కోడికూర వండమని భార్యకు చెబితే పట్టించుకోలేదని… మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌లో ఎ.సత్యనారాయణ(52), దేవకి దంపతులు నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ మద్యానికి బానిసై పనిపాటు చేయకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. పైపెచ్చుబార్య కూలికి పోయి తెచ్చిన డబ్బులు కూడా లాక్కొని మద్యం తాగొస్తాడు. ఇది ఆ ఇంట్లో జరిగే నిత్య తతంగం. మద్యం మత్తులో ఉన్నసత్యనారాయణ తరచూ భార్య తో గొడవపడేవాడు.

ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) ఉదయం తనకు చికెన్ వండాలని భార్యను కోరాడు. అయితే పనికి వెళ్లివచ్చిన తర్వాత ఆ డబ్బులతో చికెన్ తెచ్చి వండుతానని భార్య చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పనికి వెళ్లిన దేవిక…  సాయంత్రం ఇంటికి వచ్చింది. లోనికి వెళ్లి చూడగా భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కోడికూర వండనందుకే నా మొగడు పాణం తీసుకున్నాడని బోరుమంది. చుట్టుపక్కల వాళ్లు…పాపం అంటూ నిట్టూర్పు  విడిచారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

No comments:

Post a Comment

Post Bottom Ad