ఫ్రాన్స్‌లోని డువే నగరానికి చెందిన ఓ మహిళ తన కన్న తండ్రితోనే సంబంధం పెట్టుకుంది. ఎనిమిది మంది పిల్లలకి జన్మనిచ్చింది. వారిని పురిట్లోనే చంపేసి తన ఇంటి ఆవరణలోనే పాతి పెట్టింది. ఫ్రాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు తీర్పు మరో రెండు రోజుల్లో వెలువడనుంది.
డువే నగరానికి చెందిన డామినీ కాట్రడ్జ్ (51) అనే మహిళ భర్త ఉండగానే తన కన్న తండ్రితోనే సంబంధం పెట్టుకుంది. ఆయనతోనే ఎనిమిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా వారిని పురిట్లోనే కడతేర్చింది. డామినీ స్వతహాగా స్థూలకాయురాలు కావడంతో ఆమె గర్భవతి అన్న విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. అయితే అనంతరం పిల్లలను పాతి పెట్టిన చోట విపరీతమైన వాసన రావడంతో అక్కడ తవ్విచూశారు. అప్పడు వరుసగా పిల్లల శవాలు బయటపడ్డాయి. ఈ చిన్నారులను పురిట్లోనే హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఆ హత్యలు తానే చేసినట్టు డామినీ పోలీసుల ముందు అంగీకరించింది. ఆ దేశ కోర్టులు కూడా ఈ కేసును అత్యంత తీవ్రమైన కేసుగా పరిగణించాయి. వచ్చే గురువారం తీర్పు వెలువడే అవకాశముంది. నేరం రుజువైతే ఆమెకు ఉరిశిక్ష పడుతుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments:
Post a Comment