ట్యాక్సీకి టోకరా వేసినందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు ఓ యువతికి ఆశ్చర్యకరమైన పనిష్‌మెంట్ ఇచ్చింది. 48 కిలోమీటర్ల దూరం నడవాలను ఆమెకు శిక్షను విధించింది. ట్యాక్సీలో ప్రయాణించి డబ్బులు చెల్లించకుండా ఆమె వెళ్లిపోయింది.
గతవారం ఒహోయోలోని లేక్ కంట్రీ నుంచి పెన్సిల్వేనియాకు ట్యాక్సీలో ప్రయాణించిన విక్టోరియా బాస్కోమ్ అనే యువతి తన గమ్యస్థానం వద్ద ట్యాక్సీ ఆగగానే డబ్బులివ్వకుండా చటుక్కున పారిపోయింది. దీంతో, ట్యాక్సీ డ్రైవర్ ఆమెను పట్టుకుని కోర్టుకీడ్చాడు.
ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు జడ్జి విక్టోరియాను దోషిగా నిర్ధారించి ఆమె ట్యాక్సీలో ప్రయాణించిన 48 కిటోమీటర్ల దూరం నడవడంతోపాటు నష్టపరిహారంగా ట్యాక్సీ డ్రైవర్ కు 100 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.
కాగా, న్యాయమూర్తి పేరు మైఖేల్ కికొనెట్టి. అతను వెర్టీ తీర్పులు ఇస్తారని పేరు ఉంది. అంతేకాదు, దోషులు శిక్ష ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు. విచారణ సమయంలో ఒకవేళ ట్యాక్సీ దొరకకుంటే నువ్వెలా వెళ్లేదానివని జడ్జి విచారణ సమయంలో విక్టోరియాను ప్రశ్నించారు.
దానికి ఆమె తాను నడుచుకుంటూ వెళ్లేదాన్నేమో అని చెప్పింది. దీంతో న్యాయమూర్తి లేక్ కంట్రీ జైలులో 60 రోజులు పని చేస్తావా? లేక నువ్వు ప్రయాణించిన దూరం నడిచి వెళతావో చెప్పమని శిక్ష నిర్ణయాన్ని విక్టోరియాకే వదిలేశాడు. దాంతో ఆమె నడిచేందుకు అంగీకరించింది.


No comments:
Post a Comment