తెలంగాణ హబ్‌కు సంబంధించిన ప్రోమో వీడియాని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు ట్విట్టర్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ వీడియోలో స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చూపిస్తూ ఆకట్టుకుంది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, కొత్త ఐటీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు తెలంగాణ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు గతంలోనే ఆయన పేర్కొన్నారు.
జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ ఇంక్యూబేటర్ (టి హబ్) ఏర్పాటు పనులను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
Watch this promo video of T-Hub, India's largest incubator for startups, a Govt of Telangana initiative: http://t.co/vfMOBwCjka
— Min IT, Telangana (@MinIT_Telangana) June 19, 2015
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నల్సార్ యూనివర్సిటీలతో సంయుక్తంగా టి హబ్‌ను ఏర్పాటు చేశాయి. యానిమేషన్, ఇంక్యూబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని టి హబ్ పని చేస్తుంది.
రూ.35 కోట్లతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశలో చేపట్టే టీ హబ్ ద్వారా 2017నాటికి 400 స్టార్టప్‌లు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు భూమి పూజ కార్యక్రమంలో ఆయన తెలిపారు.
No comments:
Post a Comment