Shaves off Half His Head and Moustache: Loses Grama Panchayat Polls Bet - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Tuesday, June 9, 2015

Shaves off Half His Head and Moustache: Loses Grama Panchayat Polls Bet


గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తన మద్దతుదారుడు ఓడినందుకు గాను అరగుండు, సగం మీసంతో ఊరేగాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలూకా నగరిగెరె గ్రామ పంచాయతీ మట్టావులహళ్ళిలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అశ్వత్థనారాయణ పచ్చి కాంగ్రెస్ వాది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గంగాధరప్ప గెలుస్తాడని, ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్ధి గనుక ఓడిపోతే అరగుండు, సగం మీసంతో ఊరేగుతానని బెట్టింగ్‌ కట్టాడు.

మట్టావులహళ్ళిలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ది గంగాధరప్పపై బీజేపీ అభ్యర్ధి ఆదినారాయణస్వామి ఒక ఓటు ఆధిక్యంతో గెలిచారు. దీంతో కార్యకర్తలు, గ్రామస్తులతో చేసిన బెట్టింగ్ ప్రకారం అశ్వత్థనారాయణ అరగుండు చేయించుకుని, మీసాలను సగం తొలగించుకుని గ్రామంలోఊరేగారు.

No comments:

Post a Comment

Post Bottom Ad