MLC Elections Starts in: Mana Telangana assembly - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Monday, June 1, 2015

MLC Elections Starts in: Mana Telangana assembly


శాసన మండలి ఎన్నికలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ కార్యదర్శి సదారాం వ్యవహరిస్తున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. రాత్రి 8 గంటలకు తుది ఫలితాలు వెలువడనున్నాయి. 

టీఆర్‌ఎస్ తరపున కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, టీడీపీ తరపున వేం నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ ఏజెంట్‌గా పెద్దిరెడ్డి, కాంగ్రెస్ ఏజెంట్‌గా గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ ఏజెంట్లుగా శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్, రాకేశ్, గట్టు రామచందర్‌రావు, రమేశ్ వ్యవహరించనున్నారు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం, వైసీపీ మద్దతిస్తోంది. 

శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad