Hyderabadi Student Shot Dead In America - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Monday, June 15, 2015

Hyderabadi Student Shot Dead In America


ఐ ఫోన్‌ లాక్కోబోగా అడ్డుచెప్పినందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన కాప్రా పరిమళనగర్‌కు చెందిన విద్యార్థి ఐలా కిరణ్‌కుమార్‌గౌడ్‌(23) ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కిరణ్‌కుమార్‌గౌడ్‌ హత్యకు గురైన విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు రూపాభవానీ, శ్రీహరి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. కిరణ్‌కుమార్‌గౌడ్‌ వారి పెద్ద కుమారుడు. విజయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసి... ఈసీఐఎల్‌లోగల చైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివాడు. చీరాలలోని గీతాంజలి కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి మే 4వ లేదీన ఫ్లోరిడా సిటీ అట్లాంటా యూనివర్సిటీలో చేశారు. స్నేహితుడితో కలిసి యూనివర్సిటీకి ఆదివారం వెళుతుండగా దారుణం జరిగింది. అమెరికా వెళ్లిన కొద్ది రోజుల్లోనే కుమారుడు హత్యకు గురవడంపట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎంతో బంగారు భవిష్యత్తు కుమారుడిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని కుమిలిపోతున్నారు. అమెరికా నుంచి మృతదేహం త్వరగా నగరానికి చేరుకునేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీహరి విజ్ఞప్తి చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad