Forensic Lab confirms cash for vote tapes not doctored - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Thursday, June 25, 2015

Forensic Lab confirms cash for vote tapes not doctored


ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకమైన ఆడియో, వీడియో టేపులను పరిశీలిస్తున్న ఫోరె న్సిక్ (ఎఫ్‌ఎస్‌ఎల్) ల్యాబ్ తన ప్రాథమిక నివే దికను బుధవారంనాడు ఎసిబి కోర్టుకు అందిం చింది. ఈ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావిం చినట్లు తెలిసింది. తమకు అందిన ఆడియో, విడియో టేపుల్లోని ఎపి సిఎం చంద్రబాబుతో పాటు టిడిపి ఎం.ఎల్.ఎ రేవంత్‌రెడ్డి మాటలు ప్రాథమిక పరీక్షల్లో సరి పోలాయని ఆ నివేదికలో ఎఫ్‌ఎస్‌ఎల్ పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నివేదిక ఆధారంగా ఎసిబి కోర్టు ఒకటి రెండు రోజుల్లో స్వర నమూనాల కోసం చంద్రబాబుతో పాటు రేవంత్‌రెడ్డి తదితరులకు తాఖీదులు జారీ చేసే అవకాశం వుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టయి చర్లపల్లి జైల్లో వున్న రేవంత్ రెడ్డి బెయిలు పిటిష న్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఇదే కేసులో నాలుగవ నిందితుడుగా వున్న జెరూసలేం మత్తయ్య స్కాష్ పిటిషన్ పొడిగింపు పైనా విచారణ గురువారానికి వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల మధ్య రాజ కీయ పోరుకు దారితీసిన ఓటుకు నోటు వ్యవహా రం కీలక దశకు చేరింది. ఈ కేసులో కీల కంగా వున్న ఆడియో, విడియో టేపుల పరి శీలనను ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు దాదాపు పూర్తి చేశారు.
దీనిపై తమకు మరిన్ని ఉపకరణాలు కావాలని, దీంతో పాటు ఈ కేసులో అనుమానితులుగా వున్న వారి స్వర నమూనాలను ఇప్పించాలని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు మంగళ వారం ఎసిబి కోర్టును కోరడం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎసిబి కోర్టు ఎఫ్‌ఎస్‌ఎల్ కోరిన ఉపకరణాలు అందించాలని ఎసిబిని ఆదేశించింది. నామినేటెడ్ ఎం.ఎల్.ఎ స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సంభాషణలు, అనంతరం స్టీఫెన్‌సన్‌తో చంద్ర బాబు మాట్లాడ డంపై రికార్డయిన టేపులు ఎసిబి కోర్టుకు ఎఫ్‌ఎస్‌ఎల్ అందించింది. తమకు అందిన ఆడియో, విడియో టేపుల్లో ఎలాంటి ఎడి టింగ్‌కానీ, మార్పులు కానీ జరగ లేదని, అంతా వున్నది వున్నట్లు గానే ఎసిబి అధికారులు అందిం చారని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో వున్నట్లు తెలిసింది.
తమ వద్ద వున్న ఆధారాలను సరిచూసేం దుకు చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి తదితరుల స్వర నమూనాలను సమకూర్చాలన్న ఎఫ్‌ఎస్‌ఎల్ అభ్యర్ధనపై ఎసిబి కోర్టు ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఆడియో, విడియో టేపులపై ఒకటి, రెండు రోజుల్లో ఎఫ్‌ఎస్ ఎల్ ఎసిబి కోర్టుకు అధికారిక నివేదిక అందించిన తరువాత దీనిపై కోర్టు నుంచి చంద్రబాబు తదితరు లకు తాఖీదులు జారీ అయ్యే వీలుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad