A Real Story Movie on KCR and Chandrababu naidu - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Tuesday, June 23, 2015

A Real Story Movie on KCR and Chandrababu naidu


రాజకీయనాయకులైన యంజీఆర్‌`కరుణానిధిలపై ‘ఇరువర్‌’ పేరుతో ఓ సినిమా తీసారు ప్రఖ్యాత దర్శకులు మణిరత్నం. ఐశర్యరాయ్ మెయిన్‌ హీరోయిన్‌గా నటించిన ఆ చిత్రం తెలుగులో ‘ఇద్దరు’ పేరుతో అనువాదమైంది కూడా. ఇప్పుడు తెలుగు చంద్రులైన కె.చంద్రశేఖర్‌రావు`ఎన్‌.చంద్రబాబునాయుడిపై ఓ సినిమా రూపొందిస్తే ఎలా ఉంటుందని ఓ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆలోచన చేస్తున్నాడని తెలుస్తోంది. కరుణానిధికి జూనియర్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన యంజీఆర్‌.. అనతికాలంలోనే కరుణానిధిని మించిపోయారు. 

కే‌సి‌ఆర్ కూడా అంతే. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా, డిప్యూటి స్పీకర్‌గా పని చేసిన కే‌సి‌ఆర్.. చంద్రబాబును ఎప్పుడో మించిపోయారు. చంద్రబాబు ప్రతిపక్షానికి పరిమితమైన రోజుల్లోనే కేంద్రమంత్రి పదవిని సాధించిన కే‌సి‌ఆర్. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కాగలిగారు. అంతేకాదు.. సమకాలీన రాజకీయాల్లో అపర చాణక్యుడని పేరుగాంచిన చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ.. రోజుకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరి జీవితాలను ప్రేరణగా తీసుకొని.. ఓ సినిమా రూపొందించి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న వివాదాస్పద దర్శకుడి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే!! 

No comments:

Post a Comment

Post Bottom Ad