A man Found Dead After Falling From British Airways Plane In London - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Saturday, June 20, 2015

A man Found Dead After Falling From British Airways Plane In London



విమానంలో నుండి కిందపడిన వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన లండన్ లో జరిగింది. మరణించిన వ్యక్తి స్నేహితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని అధికారులు చెప్పారు. వీరిద్దరు విమానం కిందకు ఎలా వచ్చారనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

బ్రిటీష్ ఎయిర్ వేస్ అధికారుల కథనం మేరకు గురువారం బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం దక్షిణాఫ్రికా లోని జోహెన్నెస్ బర్గ్ నుండి లండన్ కు బయలుదేరింది. విమానంలో ప్రయాణికులు ఉన్నారు. 13 వేల కిలో మీటర్లు దూరం ఉన్న లండన్ చేరుకోవడానికి 11.20 గంటల సమయం పడుతుంది.

అయితే విమానం ల్యాండింగ్ గేర్ దగ్గర ఇద్దరు యువకులు దొంగచాటుగా లండన్ కు ప్రయాణించారు. విమానం ఎత్తులో వెలుతున్నది. వారు ల్యాండింగ్ గేర్ దగ్గర కుర్చుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

విమానం లండన్ లోని హీత్రూ విమానాశ్రం చేరుకునే ముందు రిచ్ మండ్ మీద వెలుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ దగ్గర ఉన్న ఒక యువకుడు అదుపుతప్పి కిందకు పడిపోయాడు. రిచ్ మండ్ లోని ఒక దుకాణం మీద పడి దుర్మరణం చెందాడు.

తరువాత ల్యాండింగ్ గేర్ దగ్గర కొన ఊపిరితో ఉన్న యువకుడిని గుర్తించిన విమాన సిబ్బంది అతనిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థతి విషమంగానే ఉందని అధికారులు ఉంటున్నారు. వీరిద్దరు విమానం ల్యాండింగ్ గేర్ దగ్గరకు ఎలా వచ్చారు అని విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad