Did You Know: A 20 Year Old scotland Student Elected as Britain's Youngest MP - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Friday, May 8, 2015

Did You Know: A 20 Year Old scotland Student Elected as Britain's Youngest MP



స్కాట్లాండ్‌కు చెందిన ఓ 20 యేళ్ల విద్యార్థిని సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా జరిగిన బ్రిటన్ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇంకా డిగ్రీ కూడా పూర్తి కాని 20 ఏళ్ల యువతి మేరీ బ్లాక్ ఏకంగా బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది.

రాజకీయాల్లో దిగ్గజాలను ఢీ కొట్టిన బ్లాక్, లేబర్ పార్టీ అభ్యర్థి డగ్లస్ అలెగ్జాండర్‌పై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం గ్లాస్గో యూనివర్సిటీలో చదువుతున్న మేరీ, ఇంకా ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉంది. స్కాట్లాండ్‌కు చెందిన మేరీ చదువుకుంటూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్కాటిష్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేసింది.

తన సొంత ఊరు పైస్లీ దశాబ్దాలుగా నిరాదరణకు గురైందని, ఈ కారణంగా తన ఊరిలో ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులే తనను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయని ఆమె విజయం అనంతరం వ్యాఖ్యానించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad